అఖండ టైటిల్ కు ముందు అనుకున్న టైటిల్ ఏంటంటే…!


నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.మల్లి మూడో సారి వీరిద్దరి కంబినేషన్లో అఖండ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్నారు.జగపతి బాబు,శ్రీకాంత్ మరియు పూర్ణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

దింతో ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే అఖండ సినిమా ట్రైలర్ ను మరియు రెండు పాటలను విడుదల చేసారు చిత్ర యూనిట్.అత్యధిక వ్యూస్ తో అఖండ ట్రైలర్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తుందని చెప్పాలి.అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇటీవలే మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అఖండ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పడం జరిగింది.

ఈ సినిమా కథను 2014 సంవత్సరంలోనే వినడం జరిగిందట.అఖండ టైటిల్ ఫిక్స్ చేయక ముందు మహార్జాతకుడు అనే టైటిల్ ను అనుకున్నట్టు తెలిపారు.తాజాగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.ఈ నెల 27 న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని సమాచారం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *