అతడిది నిజంగానే అద్భుతమైన టాలెంట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు.!

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.సమయం వచ్చినప్పుడు వారి ప్రతిభ ఈ లోకానికి తెలుస్తుంది.మన దేశంలో ప్రతిభ ఉన్న వాళ్ళు చాల మంది ఉన్నారు.తమలోని ప్రతిభను బయటకు తీసి చాల మంది పనికి రాని వస్తువులతో చాల ఇన్వెన్షన్లు చేస్తుంటారు.అలాగే తాజాగా ఒక వ్యక్తి చేసిన ఇన్వెన్షన్ కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఆ వ్యక్తి చేసిన వీడియొ చుస్తే అది నిజంగా సాధ్యమేనా,ఆ వ్యక్తి ఎలా చేశాడా అని అనుకుంటారు.ప్రస్తుతం ఆ వ్యక్తి చేసిన ఇన్వెన్షన్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియొ లో ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ తన బైక్ కు ఒక రంగులరాట్నం ను కట్టి ఒక కార్ స్టీరింగ్ ను కూడా ఆ రంగులరాట్నం కు తగిలించాడు.రోడ్డు మీద ఒక వైపు బైక్ ను స్పీడ్ గా నడుపుతూనే మరో వైటపు రంగులరాట్నం ను కూడా బాలన్స్ చేస్తున్నాడు.ఆ రంగులరాట్నం లో తన కుటుంబసభ్యులను కూర్చోబెట్టాడు.ఇదంతా ఆ బైక్ వెనకాలే వెళ్తున్న కారులో ఉన్న వ్యక్తి వీడియొ తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతుంది.

ఈ వీడియోను siddhesh sawant అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు.మా సొంత వలస ఇంజినీర్ అనే కాప్షన్ తో ఆ వ్యక్తి బిజినెస్ మాన్ ఆనంద్ మహింద్రను ట్యాగ్ చేసారు.ఆ వీడియొ చుసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురి అవుతూ ఆ వ్యక్తి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.కామెంట్స్ మరియు లైకులతో వీడియొ వైరల్ అవుతుంది.అతడిది అమేజింగ్ టాలెంట్ మరియు ఇది నిజంగానే అద్భుతమంటూ చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *