శంకర్ దర్శకత్వంలో 2005 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం అపరిచితుడు.అపరిచితుడు చిత్రం అంటేనే ముందుగా ప్రేక్షకులకు బాగా గుర్తుకువచ్చేది హీరో విక్రమ్.ఈ సినిమాలో మూడు పాత్రలలో హీరో విక్రమ్ నటన అద్భుతమని చెప్పచు.అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఈ చిత్రం ఊహించని రికార్డులు సృష్టించింది.ఈ చిత్రం తర్వాత హీరో విక్రమ్ మార్కెట్ మరియు దర్శకుడు శంకర్ మార్కెట్ అమాంతంగా పెరిగిపోయాయి.హీరో విక్రమ్ వరుస అఫర్ లతో బిజీగా అయిపోయాడు.తాజాగా అపరిచితుడు సినిమాను దర్శకుడు శంకర్ రణ్వీర్ సింగ్ హీరోగా హిందీ రీమేక్ చేయనున్నారు.
విక్రమ్ కంటే ముందే అపరిచితుడు అనే టైటిల్ ను మరో హీరో కోసం ఫిక్స్ చేశారట.రవితేజ హీరోగా 1999 లో శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం నీ కోసం.అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.అయితే ఈ సినిమాకు ముందే 1994 అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సమయంలో శ్రీనువైట్ల కు అవకాశం రావడంతో అపరిచితుడు అనే టైటిల్ తో సినిమా చేయాలి అనుకున్నాడు శ్రీనువైట్ల.ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యి షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది తర్వాత అనుకోని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది.
ఈ సినిమా కోసం హీరోగా రాజశేఖర్ ని అనుకున్నారు.నిర్మాత కూడా ఓకే అయినా తర్వాత అపరిచితుడు టైటిల్ తో రాజశేఖర్ తో సినిమా తీయాలి అని అనుకున్నాడు శ్రీనువైట్ల.కానీ షూటింగ్ కూడా మొదలైన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత కూడా శ్రీనువైట్ల మల్లి అపరిచితుడు సినిమా గురించి ఆలోచించలేదు.ఇలా హీరో రాజశేఖర్ అపరిచితుడు అనే టైటిల్ సినిమాను చేయలేకపోయారు.దింతో మల్లి కొన్ని సంవత్సరాల తర్వాత హీరో విక్రమ్ అపరిచితుడు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.