నిట్ విద్యార్థులు లక్షల్లో వేతనాలతో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.ఇంకా చదువు పూర్తికాకముందే గేట్ దాటక ముందే ఆఫర్ లేటర్లను అందుకున్నారు నిట్ విద్యార్థులు.మల్టీ నేషనల్ కంపెనీలు నిట్ లో క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.అప్పుడే 170 మంది విద్యార్థులు 2018-2022 బ్యాచ్ లో అఫర్ లేటర్లను అందుకోవడం జరిగింది.మినిమం గా సంవత్సరాన్ని 7 .8 లక్షల నుంచి 26 లక్షల వరకు వేతనం పొందే లక్కీ ఛాన్స్ కొట్టేసారు.
అమెజాన్ లో రూ.32 లక్షల ప్యాకేజి తో 2017 -2021 నుంచి ముగ్గురు విద్యార్థులు అఫర్ లెటర్ ను అందుకున్నారు.అయితే ఆరు సంవత్సరాల క్రితం నిట్ ఏర్పడినప్పుడు కొత్త ల్యాబ్లు ఎలా ఉంటాయో,విద్యాబోధన ఎలా ఉంటుందో అనే అనుమానంతో మల్టీ నేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించటానికి వెనుకడుగు వేసేవి.అయితే విద్యార్థులు తమ టాలెంట్ తో అదరహో అనిపించారు.
మల్టీ నేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం భారీ వేతనాలతో చాల మందికి అఫర్ లు రావడంతో నిట్ లో చదివేందుకు క్రేజ్ బాగా పెరుగుతుంది.ఇప్పటి వరకు నిట్ నుంచి బయటకు వచ్చిన వాళ్లకు దాదాపుగా 80 శాతం పైగా విద్యార్ధలకు అఫర్ లెటర్లు వచ్చాయి.