ఆధునిక హంగులతో ఎంతో విలాసవంతంగా తయారవుతున్న పూజ హెగ్డే కొత్త ఇల్లు….ఫోటోలు నెట్టింట వైరల్…


తమిళ సినిమా ఇండస్ట్రీ లో మూగముడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే.ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య కు జోడిగా ఒక లైలా కోసం సినిమాలో నటించింది.ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేక పోయిన కూడా పూజ కు నటి గా మంచి గుర్తింపును తెచ్చింది.వరుణ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాలో గోపికమ్మ పాటతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూజ హెగ్డే.

పూజ హెగ్డే తల్లి తండ్రులు మంజునాథ్ హెగ్డే,లత హెగ్డే.వీరి స్వస్థలం కర్ణాటక లోని మంగళూరు అయినా కూడా పూజ పుట్టింది మాత్రం ముంబై లోనే.ఇటీవలే పూజ హెగ్డే తన సొంత డబ్బులతో ముంబై లో తన ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది.ఇంటి ఇంటీరియర్ డిజైన్ ను పూజ దగ్గరుండి చేయిస్తుంది.ఆధునిక హంగులతో తన ఫ్లాట్ ను ఎంతో విలాసవంతంగా దగ్గరుండి మరి రూపకల్పన చేయిస్తుంది పూజ హెగ్డే.

ప్రస్తుతం పూజ ముంబై ఫ్లాట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాబోయే కొన్ని నెలల్లో పూజ తన సొంత ఇంట్లో కి గృహ ప్రవేశం చేయనుంది.ఇటీవలే పూజ హెగ్డే అఖిల్ కు జోడిగా నటించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.ప్రస్తుతం పూజ రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటిస్తుంది.అలాగే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ కు జోడిగా నటిస్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *