సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్,రాజీవ్ కనకాల చాల మంచి స్నేహితులు.కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్,రాజీవ్ కనకాల కలిసి నటించటం జరిగింది.స్టూడెంట్ నెం.1 ,ఆది,నాగ ఇలా చాల సినిమాల్లో కలిసి నటించారు ఎన్టీఆర్,రాజీవ్ కనకాల.సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ రాజీవ్ మంచి స్నేహితులు.ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్న మంచి ఫ్రెండ్స్ అనే చెప్పచు.
ఏ చిన్న పార్టీ జరిగిన కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మరియు వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని పిలిచి చేసుకుంటారు.2009 లో ఎన్నికల సమయంలో కారు ప్రమాదానికి గురై ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ ప్రమాదానికి ముందే నాగ సినిమా షూటింగ్ లో మరో ఘోర ప్రమాదం నుంచి కూడా బయటపడినట్లు రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.నాగ సినిమా షూటింగ్ లో ట్రైన్ మీద ఒక యాక్షన్ సీన్ షూట్ చేశామని,ఆ సమయంలో ఉన్నఫళంగా ట్రైన్ స్టార్ట్ అవడంతో ఇద్దరం కింద పడిపోయామని తెలిపారు రాజీవ్ కనకాల.అక్కడే ఉన్న ఇనుపరాడ్డు ని పట్టుకొని బయటపడ్డాము లేకపోతె ఇద్దరం కూడా చనిపోయేవాళ్ళము అని తెలిపారు రాజీవ్ కనకాల.