టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక చిన్న చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో చాల మంది స్టార్ హీరోయిన్లు చాల మంది రచయితలతో చర్చలు జరిపి మంచి కథ దొరికితే నిర్మాతగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే క్రమంలో హీరోయిన్ రష్మిక కూడా నిర్మాతగా మారె ఆలోచన చేస్తున్నారని సినిమా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.దీనికోసం రష్మిక భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కథ దొరికితే తక్కువ బడ్జెట్ లో సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
కొంత మంది కొత్త కొత్త రచయితలతో మరియు కొత్త రచయితలతో ఆమె మంచి కథ కోసం మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి.దర్శకుడిగా కూడా అవకాశం ఇచ్చేందుకు ఆమె రెడీ గా ఉన్నారని టాక్ వినిపిస్తుంది.మంచి కథ దొరికితే పెట్టుబడి పెట్టేందుకు ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఆమె కొంత మంది సన్నిహితులకు మెయిల్ ఐడి కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.నాలుగు సంవత్సరాల నుంచి రష్మిక నిర్మాతగా మారడానికి గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి ఉన్న పరిస్థితుల మూలంగా ఆమె వెనుకడుగు వేసినట్టు సమాచారం.భవిష్యత్తలో మాత్రం మంచి కథ దొరికితే ఆమె ఖచ్చితంగా నిర్మాతగా మారాలని భావిస్తున్నారని సమాచారం.