ఆ సమయంలో బాత్రూమ్స్ కూడా కడిగేవాడిని అంటూ చెప్పుకొచ్చిన జబర్దస్త్ కమెడియన్…

బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కు క్రేజ్ బాగా ఎక్కువ అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ షో ప్రారంభమయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్న కూడా ఇంకా ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.టాప్ టిఆర్పి రేటింగ్స్ తో బుల్లి తెర మీద ప్రసారం అవుతున్న రియాలిటీ షో లలో ఈ షో కూడా ఒకటి.అయితే జబర్దస్త్ షో ద్వారా స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న చాల మంది కమెడియన్స్ అందరు కూడా ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా చాల కష్టాలు పడిన వాళ్లే.జబర్దస్త్ కమెడియన్స్ కు ఇప్పుడు బయట చాల క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ షో ద్వారా పాపులర్ అయినా సుడిగాలి సుధీర్,హైపర్ ఆది వంటి వాళ్ళు కూడా చాల పేదరికం అనుభవించిన వాళ్లే.ఈ షో ప్రారంభమయ్యినప్పటి నుంచి కమెడియన్స్ అందరి జీవితాలు మారిపోయాయి.ఈ షో కమెడియన్స్ అందరికి స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టింది.జబర్దస్త్ కమెడియన్స్ లో వేణు కూడా ఒకడు.ఈ షో మొదలైనప్పటి నుంచి వేణు వండర్స్ అనే టీం పేరుతొ వేణు అనేక స్కిట్లు చేసి చాల మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికి కూడా వేణు చేసిన కామెడీ కోసం యు ట్యూబ్ లో సెర్చ్ చేస్తూనే ఉంటారు చాల మంది.

సుడిగాలి సుధీర్,గెట్ అప్ శ్రీను ను జబర్దస్త్ షో కు పరిచయం చేసింది వేణు నే.అయితే ఒక సమయంలో కొంత మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకు వచ్చేసారు.అలా బయటకు వచ్చేసి వేణు కూడా వేరే చానెల్స్ లో కొన్ని షో లు చేయడం జరిగింది.అయితే జబర్దస్త్ కామెడీ షో లోకి రాకముందు వేణు కొన్ని సినిమాలు కూడా చేసాడు.ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాల కష్టాలు పడ్డాడు వేణు.చూడాలని వుంది సమయంలో సెట్ బాయ్ గా రోజుకు 70 రూపాయలు తీసుకునే వాడు.కొంత మంది దర్శకుల దగ్గర కూడా పని చేసి వాళ్ళ బాత్రూమ్స్ కడగడం,తినే ప్లేట్స్ కూడా కడిగేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు వేణు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *