ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను ఏ దిశలో పెడితే లాభం…ఏ దిశలో పెడితే నష్టమో….తెలుసా…

మనీ ప్లాంట్ మొక్క అంటే అందరికి తెలిసిందే.చాల మంది తమ ఇళ్లలో అలంకరణ కోసం మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు.అయితే ఈ మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు కానీ దానిని ఏ దిక్కులో పెడితే మంచిదో అలాగే ఏ దిక్కులో పెడితే చెడు ప్రభావం కలుగుతుందో చాల మందికి తెలియదు.సూర్యరశ్మి లేకపోయినా కూడా ఈ మొక్క పెరుగుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ అంటే డబ్బుకు ప్రతీక అని చాల మంది నమ్ముతారు.ఈ మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు,మరియు వాస్తు దోషాలు కూడా ఉండవు అంటూ చాల మంది చెప్తుంటారు.

ఇంట్లో కూడా ఎల్లప్పుడు ధనం మరియు ఆనందం కలుగుతాయి అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తుంటారు.ఆగ్నేయ దిశకు అధిపతి వినాయకుడు,ఈ దిశా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆగ్నేయ దిశలో పెంచితే వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది మరియు ధన లాభం కలుగుతుంది,ఆనందం గా ఉంటారు అని చెప్తారు.అలాగే ఈ మనీ ప్లాంట్ మొక్కను తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యంలో పెంచితే చెడు ప్రభావం కలుగుతుంది అని అంటారు వాస్తు శాస్త్రం ప్రకారం.

ఈ మొక్కను ఇంట్లో నే పెంచితే శక్తి ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తారు.ఈ మొక్క తీగ జాతికి చెందింది కాబట్టి దీన్ని పై పై కి పెరిగేలా పెట్టడం మంచిది.కిందకు వేలాడదీయకూడదు.అలా చేస్తే చెడు ప్రభావాలు,నష్టాలూ కలుగుతాయి.నీటి డబ్బాలో లేకపోతె పెద్ద కుండ వంటి వాటిలో పెట్టి ఈ మొక్కను పెంచవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *