మన చుట్టూ అప్పుడప్పుడు మనం ఊహించని వింత ఘటనలు జరుగుతుంటాయి.అవి మనకి ఆశ్చర్యానికి కలిగించేలా ఉంటాయి.అవి నిజంగానే జరిగాయా..ఇలా జరగడం సాధ్యమేనా అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు.అలాంటి వింత ఆశ్చర్యానికి గురి చేసారు సంఘటన ఒకటి తిరుపతి లో గురువారం సాయంత్రం జరిగింది.ఆ వింత చూడడానికి చుట్టుపక్కల జనాలు తరలి వస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిన ఈ ఘటన గురించే ఎక్కడ చుసిన కూడా చర్చ జరుగుతుంది.ఇంతకీ వివరంగా చెప్పాలంటే…తిరుపతిలోని ఏంఆర్ పల్లిలో కృష్ణ నగర్ లో నివసించే ఒక మహిళా తన ఇంట్లో ఉన్న 25 అడుగుల వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఒక షాకింగ్ ఘటన జరిగింది.
ఆ మహిళా వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ వాటర్ ట్యాంక్ పైకి రావడం మొదలైంది.దింతో ఒక్కసారిగా షాక్ అయినా ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు.దింతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది.భార్య అరుపులు విన్న భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా ఆ వాటర్ ట్యాంక్ పైకి లేవడం చూసి షాక్ అయ్యాడు.నిచ్చెన సహాయంతో తన భార్య ను బయటకు తీసాడు.ఈ క్రమంలో ఆ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.18 వొరలతో ఏర్పాటు చేయబడిన ఆ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా 11 వొరలతో బయటకు వచ్చేసింది.అలా నిటారుగా బయటకు వచ్చిన ఆ వాటర్ ట్యాంక్ ను చూడడానికి చుట్టూ పక్కల ఉన్న జనాలు తరలివస్తున్నారు.
స్థానిక ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు.ఈ విషయం తెలుసుకొని ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల యూనిట్ కూడా అక్కడికి చేరుకొని పరిశీలించారు.దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ఇలా జరగటం ఇదే మొదటి సారి అని తెలిపారు.భూమి పొరలలో మార్పులు,సంప్ నిర్మాణ సమయంలో ఇసుక కాలవ గట్టున ఉన్న ప్రాంతం కావడం వలన,వరదలు ఇవన్నీ కలగలిపి సంప్ 15 అడుగులు పైకి లేచిందని చెప్పుకొచ్చారు.దీని వలన భయపడాల్సిన అవసరం లేదు,ఇది భూమిలో జరిగే సహజమైన మార్పే అని చెప్పుకొచ్చారు.