బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కు చాల మంది అభిమానులు ఉంటారు.అందులో ముఖ్యంగా హైపర్ ఆదికి అభిమానులలో చాల క్రెజ్ ఉందనే చెప్పాలి.హైపర్ ఆది బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాడు.ఆ తర్వాత అభి ద్వారా జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చాడు.మంచి మంచి స్క్రిప్ట్స్ తో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది టీం లీడర్ స్థాయికి ఎదిగాడు.ప్రస్తుతం హైపర్ ఆది సినిమాలలో కూడా చేస్తున్నాడు.హైపర్ ఆది కి ప్రత్యేకంగా జబర్దస్త్ షో కు చాల ఫాలోయింగ్ ఉంది.
దింతో హైపర్ ఆది జబర్దస్త్ రెమ్యూనరేషన్ బాగా తీసుకుంటాడని,దానితోనే ఇల్లు మరియు ఆస్తులు కూడా కొన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా చేస్తున్న హైపర్ ఆదికి మల్లెమాల వాళ్ళు రెమ్యూనరేషన్ బాగా ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
దింతో హైపర్ ఆది సంపాదన సంవత్సరానికి కోటికి పైగా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది.ఇటీవలే హైపర్ ఆది తాను చదువుకునేటప్పుడు చాల ఖర్చులు అవడంతో 20 లక్షలకు పైగా అప్పులు అయ్యాయని గుర్తుచేసుకున్నాడు.దింతో హైపర్ ఆది నాన్న మూడు ఎకరాలు అమ్మి అప్పులు తిర్చారని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత ఆది జబర్దస్త్ షో కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదే ఊరిలో మల్లి 16 ఎకరాలు మరియు హైదరాబాద్ లో ఇల్లు కూడా కొన్నాడని వార్తలు వస్తున్నాయి.