ఒకే ఒక స్టార్ హీరో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో నటించారు…ఎవరంటే…!


తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో గా ఎదిగిన మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.దాదాపుగా అందరు హీరోయిన్ లతో నటించి తన నటనతో డాన్స్ తో ఇప్పటికి కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఘరానా మొగుడు చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి,నగ్మా జంటగా నటించిన ఈ చిత్రం ఘానా విజయాన్ని సాధించింది.ఆ సినిమాలో పంచ్ డైలాగులతో అదరకొట్టే చిరంజీవి పాత్ర అద్భుతమే చెప్పచ్చు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నగ్మా చెల్లెళ్ళతో కూడా చిరంజీవి నటించడం జరిగింది.నగ్మా చెల్లెలు అయినా రోషిని మాస్టర్ చిత్రంలో చిరంజీవి కు జంటగా నటించారు.అలాగే మరో చెల్లెలు అయినా జ్యోతిక ఠాగూర్ చిత్రంలో చిరంజీవి కి జోడిగా నటించారు.ఈ ముగ్గురు అక్క చెల్లెలతో నటించిన ఏకైక స్టార్ హీరో చిరంజీవి గారు అని చెప్పచ్చు.

తన సినిమా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి హీరోలకు కూడా పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం పూర్తి అయినా తర్వాత చిరంజీవి భోళా శంకర్ అనే సినిమాలో నటించనున్నారు.అయితే అటు సినిమాలతో పాటు ఇటు సేవ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉంటారు చిరంజీవి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *