ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటేనే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది డైలాగ్ లు మరియు ఫైట్ సీన్లు.బాలకృష్ణ సినిమాలలో వేసే పంచ్ డైలాగ్స్ కు చాల మంది అభిమానులు ఉన్నారు.అలాంటిది బాలయ్య ఒక్క ఫైట్ కూడా ఒక్క డాన్స్ స్టెప్పు కూడా వేయకుండా వేసిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నారి నారి నడుమ మురారి అనే చిత్రం 1990 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Advertisement

ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్,ఒక్క డాన్స్ స్టెప్పు కూడా లేకపోవడం మీరు గమనించవచ్చు.కేవలం బాలకృష్ణ నటన,సినిమా కథ మూలంగానే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది.కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శోభన,నిరోషా జంటగా నటించారు.ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను తమిళనాడు రాష్ట్రంలోని వేలచెర్రి అనే ప్రాంతంలో చిత్రీకరించారు.

మురారి నిర్మాతగా ఈ చిత్రాన్ని యువచిత్ర పతాకం బ్యానర్ పై తెరకెక్కించారు.ఇప్పటికి కూడా నారి నారి నడుమ మురారి చిత్రం టీవీ లో ప్రసారం అయితే మిస్ కాకుండా చూసే అభిమానులు చాల మంది ఉన్నారు.ఇలా ఒక్క ఫైట్,ఒక్క డాన్స్ స్టెప్పు కూడా లేకుండా బాలయ్య నారి నారి నడుమ మురారి చిత్రాన్ని తన బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారని చెప్పచు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *