కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కొడుకు కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ రాజ్ కుమార్ మరణించారు.ఈ రోజు ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది.దాంతో హుటా హుటిన ఆయన్ని బెంగళూరు లోని విక్రమ్ హాస్పిటల్ లో చేర్పించారు.ఐసీయూ లో చికిత్స అందించారు వైద్యులు.పునీత్ కుటుంబసభ్యులు,పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్,కుమార్తె నివేదిత హాస్పిటల్ కు చేరుకున్నారు.
నిర్మాతలు జయన్న,కెపి శ్రీకాంత్,రవి చంద్రన్ వంటి వారు కూడా ఆసుపత్రి కి రావడం జరిగింది.కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆసుపత్రి కి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించారు.కానీ చివరకు డాక్టర్లు యెంత ప్రయత్నించినా కూడా ఫలితం లేక పోయింది.గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది.ఆయన అభిమానులు ఆయన ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.కేవలం 46 ఏళ్ళ వయస్సులోనే ఆయన మరణించడం కర్ణాటక లో విషాదంగా మారింది.ఆయన తెలుగులో కూడా యువరత్న అనే సినిమాలో నటించారు.పునీత్ రాజ్ కుమార్ బాలకృష్ణ,మహేష్ బాబు కు మంచి మిత్రుడు.