కన్నీళ్లు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ…నెట్టింట్లో వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రం సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్.చిత్రం సినిమా తర్వాత నువ్వే కావాలి,మనసంతా నువ్వే చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.కెరీర్ ఒక్కసారిగా పీక్ కి వెళ్లే సమయం లో అనుకోని కారణాల వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.ఆ తర్వాత చేసిన నీ స్నేహం,కలుసుకోవాలని,శ్రీ రామ్,అవునన్నా కాదన్నా వంటి సినిమాలు చేసిన కూడా అవి అనుకున్నంత విజయం సాధించలేక పోయాయి.ఆ తర్వాత విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఇలా కొన్నాళ్ల తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో,సంసార జీవితంలో గొడవలతో ఎంతో వత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ రాసిన లేఖ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.ఆ లేఖలో…విషిత..మా అమ్మంటే యెంత ఇష్టమో ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు.మన మధ్య గొడవలు ఉండడం కారణంగా అంకుల్,ఆంటీ చాల బాధపడుతున్నారు.వారికి ఆ బాధ ఉండకూడదు.

నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు.కానీ అతడు మంచి వాడు అస్సలు కాదు,నా మాట విను.నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు.నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో.నాకు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.నన్ను ఓ మ్యాడ్ గా చిత్రీకరించి ఆడుకుంది.మన మధ్య గొడవల కారణంగా చాల మంది బాధపడుతున్నారు.అందరు సంతోషంగా ఉండాలి అనుకుంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను.మా అమ్మ అంటే నాకు చాల ఇష్టం.మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు,వాటిని తాను జాగ్రత్తగా దాచుకుంటుంది.అమ్మ నిన్ను ఒకసారి కౌగిలించుకొని ఏడ్వాలని ఉంది అందుకే నిదగ్గరికి వస్తున్నాను అంటూ ఉదయ్ కిరణ్ తన చివరి లేఖలో రాసాడు.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖను చదివి ఉదయ్ కిరణ్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *