ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే రోజాగారు భర్త సెల్వమణి తో కలిసి కబడ్డీ ఆడారు.రోజాగారు ఏమి చేసిన కూడా వినూత్నంగా ఉంటుంది.ఇక ఆమె నియోజక వర్గంలో రోజా గారు ఏమి చేసిన కూడా ఆమె మాటకు కట్టుబడి ఉంటారు.ఇదివరకు డప్పు కొట్టి సందడి చేసిన రోజాగారు ఆ తర్వాత జగనన్న చీరలను నేసిన సంగతి అందరికి తెలిసిందే.రోజాగారు ఏ కార్యక్రమం చేసిన సరే అందరి దృష్టి ఆమె వైపే ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజా గారు నియోజక వర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించటం జరిగింది.రోజాగారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన క్రీడా పోటీలను ప్రారంభించటం జరిగింది.ఈ సందర్భంగా రోజాగారు భర్త సెల్వమణి తో కలిసి కబడ్డీ ఆడడానికి కోర్టులో దిగారు.
రోజాగారు ఒక జట్టు వైపు మరియు సెల్వమణి గారు మరో జట్టు వైపు ఆడారు.కబడ్డీ కబడ్డీ అంటూ ప్లేయర్స్ ను ఉత్సాహపరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రోజగారు.ఇదివరకు కూడా గతంలో తన నియోజక వర్గంలో టోర్నమెంట్ ప్రారంభానికి వెళ్లి రోజా గారు కబడ్డీ ఆడి సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే.