కార్తీక దీపం హిమ,సౌర్యకు రోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు…!

బుల్లితెర మీద చాల సీరియల్స్,షోలు ప్రసారం అవుతున్నాయి.ఎన్ని షోలు మరియు సీరియల్స్ ప్రసారం అవుతున్న సరే కార్తీక దీపం సీరియల్ కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో చాల ఫాలోయింగ్ ఉందని చెప్పచు.గత కొన్ని నెలలుగా టాప్ టిఆర్పి రేటింగ్స్ తో కార్తీక దీపం సీరియల్ దూసుకుపోతుంది.మరో వైపు రియాలిటీ షోలు అయినా ఎవరు మిలో కోటీశ్వరులు మరియు బిగ్ బాస్ సీజన్ 5 షోలు కూడా కార్తీక దీపం సీరియల్ టిఆర్పి లను అందుకోలేకపోతున్నాయి.కార్తీక దీపం సీరియల్ లో ఉన్న డాక్టర్ బాబు,దీప పాత్రలకు రెండు తెలుగు రాష్ట్రాలలో చాల లక్షల్లో అభిమానులు ఉన్నారు.

అలాగే వారి పిల్లలుగా నటిస్తున్న హిమ మరియు సౌర్య కూడా తమ నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.ఈ సీరియల్ లో హిమ,సౌర్య పాత్రలు కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు.అమ్మ,నాన్న విడిపోవడానికి కారణం ఏంటి అంటూ అమాయకంగా వీళ్లు అడిగే ప్రశ్నలు అన్ని కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సీరియల్ ద్వారా హిమ మరియు సౌర్య యెంత క్రేజ్ సంపాదించుకున్నారో వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.

హిమ మరియు సౌర్య కు ఒక్క రోజు షూటింగ్ చేయడానికి ఒక్కొక్కరికి రెమ్యూనరేషన్ ఏడు వేలు ఇస్తారట.ఇంత చిన్న వయస్సులోనే వీళ్లు రోజుకు ఏడు వేలు సంపాదిస్తున్నారంటే మాములు విషయం కాదని చెప్పచు.ఇప్పటికే సౌర్య సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.మును ముందు మరిన్ని అవకాశాలతో హిమ మరియు సౌర్య కు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *