గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు చాల క్రేజ్ ఉంది.ఈ జబర్దస్త్ కామెడీ షో చాల మంది కామెడియన్లను వెలుగు లోకి తీసుకొచ్చి లైఫ్ ఇవ్వడం జరిగింది.ఈ షో లో చాల మంది సినిమాలలో కూడా చేస్తున్నారు.వారిలో కొంత మంది హీరోలుగా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు.అయితే సినిమాలలో బిజీ గా ఉన్న కూడా జబర్దస్త్ కామెడీ షోలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు చాల మంది కమెడియన్లు.ఇదివరకు హైపర్ ఆదితో పాటు మరొక టీం లీడర్ అయినా రైసింగ్ రాజు కూడా ఉండేవాడు.కానీ కొన్ని సంవత్సరాలుగా అతను జబర్దస్త్ షో లో కనిపించటం లేదు.మరోవైపు సినిమాలలో కూడా రైసింగ్ రాజు ఎక్కడ కనిపించింది లేదు.
దింతో అతను జబర్దస్త్ షో నుంచి మరియు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి ఒకానొక సమయంలో.రైసింగ్ రాజు లేకుండానే హైపర్ ఆది తన పంచ్ లతో స్కిట్లు చేసి కామెడీ బాగా పండించేవాడు.హైపర్ ఆదితో పాటు రైసింగ్ రాజు కూడా టీం లీడర్ అని చెప్తుంటారు.కానీ స్కిట్స్ నుంచి పేమెంట్స్ వరకు అన్ని చూసుకునేది మాత్రం హైపర్ ఆది అట.అయితే ఇంత గ్యాప్ తర్వాత మల్లి రైసింగ్ రాజు తిరిగిరావడం తో మల్లి అందరు కలిసి ఎప్పటి లాగానే స్కిట్లు చేస్తున్నారు.
ఇంత గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ రైసింగ్ రాజు కరోనా సమయంలో తనకు మనవరాలు పుట్టడంతో బయటకు వెళితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భావించి గ్యాప్ తీసుకున్నట్లు తెలిపారు.అయితే తానూ స్కిట్లు చేయకపోయినా కూడా ప్రతి నెల క్రమం తప్పకుండ తనకు పేమెంట్ పంపేవాడు హైపర్ ఆది అంటూ చాల ఎమోషనల్ అయ్యారు రైసింగ్ రాజు.హైపర్ ఆది నిజంగానే దేవుడు,కాళ్ళు మొక్కుదాం అంటే నా కంటే కూడా వయస్సులో చిన్నవాడు అయిపోయాడు అని చెప్పడం జరిగింది.తానూ గ్యాప్ తీసుకున్నప్పుడు హైపర్ ఆది మీద చాల మంది విమర్శలు చేసిన కూడా వాటన్నిటిని నవ్వుతు ఎదుర్కొనేవాడు అంటూ చెప్పుకొచ్చాడు రైసింగ్ రాజు.