సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీలకు మరియు అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీల చిన్ననాటి జ్ఞాపకాలు అయినా వాళ్ళ ఫోటోలు మరియు వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.నటి నటులు సోషల్ మీడియాలో తమ చిన్ననాటి ఫోటోలు కానీ వీడియోలు కానీ షేర్ చేస్తే చాలు అభిమానులు తమ ఇష్టమైన నటీనటుల ఫోటోలు క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు.ఈ క్రమంలోనే చాల మంది హీరో,హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో రోజు దర్శనం ఇస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు ఈమధ్య కాలంలో ఒక యువ హీరోయిన్ చిన్ననాటి బిందె పట్టుకొని క్యూట్ గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిన్ననాటి ఫొటోలో క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు తెలుగు చిత్ర పరిశ్రమతో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.తెలుగు మరియు తమిళంలో లావణ్య త్రిపాఠి చాల సినిమాలలో నటించింది.
తన అందంతో అభినయంతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది లావణ్య త్రిపాఠి.న్యాచురల్ స్టార్ నాని కి జంటగా భలే భలే మగాడివోయి చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు,ఉన్నది ఒక్కటే జిందగీ,అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాలలో కూడా నటించింది.తాజాగా త్రివిక్రమ్,మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.