కన్నడ సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం రోజు ఉదయం తన సొంత నివాసంలో జిమ్ చేస్తూ గుండె పోటుకు గురైన సంగతి అందరికి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ ను విక్రమ్ హాస్పిటల్ కు తరలించగా ఐసీయూ లో చికిత్స పొందుతూ మరణించారు.ఆయన మరణించిన వార్తను కర్ణాటక ముఖ్యమంత్రి అయినా బసవరాజు బొమ్మై అధికారికం ప్రకటించారు.అయితే చనిపోయిన కూడా పునీత్ రాజ్ కుమార్ ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచడానికి తన కళ్ళను దానం చేసారు.
పునీత్ మరణ వార్త విని సినిమా ఇండస్ట్రీ నటి నటులు,అభిమానులు షాక్ కు గురి అయ్యారు.ఆయన మరణించిన వెంటనే అక్కడి ప్రభుత్వం హై అలెర్ట్ ను ప్రకటించి థియేటర్లను మూసివేయాలంటూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది.పార్వతమ్మ,కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.ఆయనను అభిమానులు అప్పు అని ప్రేమగా పిలుచుకుంటారు.పునీత్ రాజ్ కుమార్ భార్య పేరు అశ్విని.
ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.అప్పు అనే సినిమాతో 2002 లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు సమాచారం.పునీత్ తల్లితండ్రులు కూడా తమ కళ్ళను దానం చేసారు.పునీత్ కూడా తన కళ్ళను దానం చేయడంతో మరో ఇద్దరు ఈ ప్రపంచాన్ని చూడగలరు.