చాణుక్య నీతి ప్రకారం ముఖ్యంగా ఈ నాలుగు విషయాలను ఎవ్వరితోను షేర్ చేసుకోకూడదు…


చాణుక్య నీతి గురించి చాల మందికి తెలిసే ఉంటుంది.ఎంతో అనుభవం ఉన్న చాణుక్యుడు తన చాణుక్య నీతి అనే పుస్తకంలో తానూ ఆచరించిన జీవితానికి,గృహ జీవితానికి సంబంధించిన చాల విషయాలను చెప్పడం జరిగింది.ప్రతి మనిషి తన జీవితంలో తనకు సంబంధించిన విషయాలను తన సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ పంచుకుంటారు.కానీ ప్రతి మనిషి జీవితంలో కొన్ని విషయాలను మన సన్నిహితులతో కూడా పంచుకోకూడదు అని చాణుక్యుడు చాణుక్య నీతి పుస్తకంలో చెప్పడం జరిగింది.అలా కొన్ని విషయాలను సన్నిహితులతో కానీ మరెవరితో కానీ ఎందుకు చెప్పకూడదో చాణుక్య నీతి పుస్తకంలో చాల వివరంగా చెప్పబడింది.

అందులో అతి ముఖ్యమైన నాలుగు విషయాలు ఉన్నాయి.ఆ నాలుగు విషయాల గురించి ఎప్పుడు కూడా ఎవ్వరితోను షేర్ చేసుకోకూడదు అని చాణుక్య నీతి చెప్తుంది.అవి ఏంటంటే..అందులో మొదటిది..మన ఆర్ధిక నష్టం గురించి ఎప్పుడు కూడా మన సన్నిహితులకు కానీ మరెవ్వరికీ కానీ చెప్పకూడదు.అలా చెప్పడం వలన అది సహాయానికి కాకుండా నిరాశకు గురిచేస్తుంది అని చాణుక్య నీతిలో చెప్పబడింది.మీ ఆర్ధిక నష్టాలూ తెలుసుకున్న వారు ఎవ్వరైనా మీ నుంచి దూరంగా జరగడం మొదలుపెడతారు.అందుకే ఆర్ధిక నష్టాల గురించి ఎప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు.రెండోది మన జీవితంలో జరిగే ఇబ్బందుల గురించి మనం ఎప్పుడు కూడా ఎవ్వరితో చెప్పుకోకూడదు.

మీ ఇబ్బందుల గురించి తెలుసుకున్న వారు మీ వెనకాల ఎగతాళి చేస్తారు.అందుకే జీవితంలో జరిగే ఇబ్బందుల గురించి పక్క వారితో చెప్పుకోకూడదు అని చాణుక్య నీతి చెప్తుంది.మూడోది..వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా వేరే వాళ్లతో షేర్ చేసుకోకూడదు.అది మును ముందు వైవాహిక జీవితంలో గంభీరతను సృష్టించే అవకాశం ఉంది.ఇక చివరిది..జీవితంలో ఎవరైనా మిమ్మల్ని అవమాన పరిస్తే,అది మీ దగ్గరే ఉంచుకోవాలి.మీ జీవితంలో జరిగిన అవమానం గురించి వేరే వాళ్లకు చెప్పినట్లయితే వాళ్లకు మీద గౌరవం తగ్గుతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *