తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,కృష్ణం రాజు,శోభన్ బాబు వంటి వారు తమ స్వయం కృషితో స్టార్ హీరోలుగా ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే.చిరంజీవి కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని తన స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగారు.అయితే అప్పటి వరకు సుప్రీమ్ హీరో గా సినిమాలు చేస్తున్న చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ రావడానికి కారణం ఒక అగ్ర నిర్మాత అని చెప్పవచ్చు.చిరంజీవి తన నటనతో,డాన్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ప్రేక్షకులను యెంత గానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు ఉన్న హీరోలతో కూడా పోటీ పడి సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో చిరంజీవి పలు హిట్ సినిమాలు చేయడం జరిగింది.ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ వంటి వారు అగ్ర హీరోలుగా ఉన్న సమయంలో కె యస్ రామారావు గారు చిరంజీవిగారి తో పలు హిట్ సినిమాలు నిర్మించారు.ఆ టైములో కె యస్ రామారావు గారు చిరంజీవి గారి కి మెగాస్టార్ అనే బిరుదును ఇవ్వడం జరిగింది.కె యస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి గారు అభిలాష,ఛాలెంజ్,రాక్షసుడు,మరణమృదంగం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు యండమూరి వీరేంద్రనాధ్ నవల ఆధారంగా తెరకెక్కబడ్డాయి.
మరణమృదంగం చిత్రంతోనే మొదటిసారిగా చిరంజీవి గారి పేరు ముందు మెగాస్టార్ అని రావడం జరిగింది.ఇక చిరంజీవి మరియు కె యస్ రామారావు కంబినేషన్లో వచ్చిన అయిదవ చిత్రం స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం విజయవంతం కాలేకపోయింది.ఈ సినిమాల తర్వాత మల్లి వీరిద్దరి కంబినేషన్లో చిత్రం రాలేదు.వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన అయిదు చిత్రాలలో మొత్తంగా నాలుగు బిగ్ సక్సెస్ సాధిస్తే అయిదవ చిత్రం మాత్రం ఆశించినంత ఫలితం రాలేదు.మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి కంబినేషన్లో భోళా శంకర్ చిత్రం తెరకెక్కనుంది.తమిళ్ లో అజిత్ హీరోగా నటించి హిట్ సాధించిన వేదాళం సినిమాకు రీమేక్ భోళా శంకర్.