March 26, 2023

జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకోవడానికి వెనుక ఉన్న కారణం ఇదే.!

ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారం అవుతున్న రియాలిటీ షో లలో జబర్దస్త్ కామెడీ షో కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతున్న ఈ షో టాప్ రేటింగ్స్ తో కొనసాగుతుంది.ఈ జబర్దస్త్ షో బాగా పాపులర్ అవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా మొదలుపెట్టారు షో నిర్వాకులు.అయితే ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో కు సుడిగాలి సుధీర్,రష్మీ జోడి కి బాగా క్రేజ్ ఉందని చెప్పచు.సుడిగాలి సుధీర్ టీం చేసే కామెడీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది.ఈ కామెడీ షో కు ఖాళీ సమయం దొరికినప్పుడు చాల మంది యు ట్యూబ్ లో వెతికి చూసే వాళ్ళు కూడా చాల మంది ఉన్నారు.

అంతగా జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయ్యి టాప్ టిఆర్పి రేటింగ్స్ తో కొనసాగుతుంది.సుడిగాలి సుధీర్ టీం చేసే కామెడీ ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో కు బాగా హైలెట్ అన్న విషయం తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా చాల మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు.చాల మంది కమెడియన్స్ కు వెలుగులోకి తెచ్చి లైఫ్ ను ఇచ్చింది ఈ షో.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో కు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పబోతున్నారని చాల వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు సుడిగాలి సుధీర్ సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఈ షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంటే మరోవైపు సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ షో నుంచి జబర్దస్త్ షో కు మార్చమని కోరడంతో ఈ షో నిర్వాకులు నో చెప్పడంతో సుధీర్ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈటీవీలో ప్రసారం అయ్యే మిగితా షోలలో మాత్రం సుధీర్ కనిపిస్తారని చెప్తున్నారు.దీనికి సంబంధించి మల్లెమాల నిర్వాహకులు సుధీర్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.సుధీర్ ఈ షో నుంచి తప్పుకుంటే ఈ షో నష్టం తప్పదని తెలుస్తుంది.దీని గురించి సుడిగాలి సుధీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *