దాన గుణం అనేది చాల గొప్పది.ఈ కలియుగకాలంలో దానధర్మాలు మనిషికి మేలు చేస్తాయి అని చాల మంది చెప్తారు.అయితే సత్య యుగంలో తపస్సు,త్రేతా యుగంలో జ్ఞానం,ద్వాపర యుగంలో యాగం అలాగే కలియుగంలో ఈ దానధర్మాలు మనిషికి మంచి చేస్తాయని సనాతన ధర్మంలో చెప్పబడింది.అయితే మనకు ఉన్న దాంట్లో ఎదుటి వారి నుండి ఏమి ఆశించకుండా చేస్తేనే ఆ దానానికి ఒక విలువ ఉంటుంది ఫలితం ఉంటుంది.అలా దానం చేసే వస్తువులలో కొన్నిటిని దానం చేస్తే చాల కోల్పోవాలిసి వస్తుంది అని నిపుణులు చెప్పడం జరిగింది.
అవి ఏంటంటే.దానాలలో గొప్ప దానం అన్నదానం అన్న విషయం అందరికి తెలిసిందే.ఇలా అన్న దానం చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు.అలా చెడి పోయిన ఆహారాన్ని దానం చేస్తే జీవితం కూడా చెడిపోతుంది అని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇంట్లో ఉండే స్టీల్ పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ దానం చేయకూడదు.అలా చేస్తే ఇంట్లో ఆనందం దూరం అవుతుంది అని చెప్తున్నారు నిపుణులు.చాల మంది నూనెను కూడా దానం చేస్తుంటారు.
కానీ ఇంట్లో వాడిన నూనెను మాత్రం అస్సలు దానం చేయకూడదు అని చెప్తున్నారు నిపుణులు.అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందట.కొంత మంది పుస్తకాలూ కూడా దానంగా ఇస్తారు.అయితే వాడిన పుస్తకాలూ కానీ చిరిగిపోయిన పుస్తకాలూ లేక గ్రంథాలు కానీ దానం చేయకూడదు.ఇంట్లో ఉపయోగించిన చీపురును అస్సలు దానం చేయకూడదట.చీపురును లక్ష్మి దేవిగా భావిస్తారు.అలాంటి చీపురును దానం చేస్తే ఇంట్లో వచ్చిన సంపాదన అంతా కూడా కర్పూరంలా కరిగిపోయి ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి.అలాగే ప్లాటిక్ వస్తువులు అంటే విరిగిన కుర్చీలు కానీ మరి ఏ ఇతర ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకూడదు.ఆ చేసినట్లయితే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.