ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ని ఎక్కడ నుంచి కాపీ చేసారంటే.!

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా సాంగ్స్ విడుదల చేసారు మూవీ మేకర్స్.దీనికి సంబంధించి ఆగస్టు నెలలో దోస్తీ అనే పాటను విడుదల చేసారు చిత్ర నిర్వాకులు.అయితే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదని వార్తలు కూడా వచ్చాయి.దాంతో ఇటీవలే తాజాగా నాటు నాటు పాటను విడుదల చేసారు చిత్ర నిర్వాహకులు.ఈ వీడియొ లో రామ్ చరణ్,ఎన్టీఆర్ చేసిన మాస్ స్టెప్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో అధిక వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ వీడియొ గురించే ఎక్కడ చుసిన చర్చలు జరుగుతున్నాయి.ఈ పాటకు రామ్ చరణ్,ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోతున్నారు సినిమా ప్రేక్షకులు.ఇప్పుడు ఈ సాంగ్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.అయితే ఈ నాటు నాటు సాంగ్ లోని కొన్ని స్టెప్పులు కాపీ కొట్టారంటూ సామజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.అయితే ఇదివరకు కూడా రాజమౌళి బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై రాజమౌళి కూడా స్పందించడం జరగలేదు.ఆఫ్రికన్ పాట అయినా masaka kids africana dancing వీడియొ నుంచి కొన్ని స్టెప్పులు కాపీ కొట్టారని ఈ వీడియొ షేర్ చేస్తూ చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటివరకు చిత్ర నిర్వాహకులు దీనిపై స్పందించలేదు.డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ మరియు ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటించడం జరిగింది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *