గుండెల మీద ఎత్తుకొని పెంచిన తండ్రిని చివరిసారిగా చూసుకునేందుకు పరుగు పరుగున పునీత్ కూతురు ధృతి బెంగళూరు కి చేరుకుంది.పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ధృతి తండ్రి ఇక లేదు,రాడు అనే వార్తను విని కన్నీటి పర్యంతమయ్యి హుటా హుటిన అమెరికా నుంచి బయలు దేరి ఢిల్లీ కి చేరుకుంది.అక్కడ నుంచి విమానంలో బెంగళూరు చేరుకొని ప్రత్యేక కన్వయర్లో కంఠీరవ స్టేడియం కు చేరుకుంది.
తండ్రిని చూడరని పరిస్థితిలో చూసి ఆయన పార్థివ దేహం పై పడి కన్నీటిపర్యంతమయ్యింది.డాడీ మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ పునీత్ ఇద్దరు కూతుర్లు బోరున విలపించారు.ఆ తల్లి కూతుర్లను ఓదార్చడం అక్కడ ఉన్న ఎవరి తరం కాలేదు.మరో వైపు కూతురు అమెరికా నుంచి రావడం తో పునీత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు పునీత్ తండ్రి సమాధి పక్కనే పునీత్ అంత్యక్రియలు కూడా జరగనున్నాయి.ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ కు సంతాపం తెలపడానికి పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు బెంగళూరు లోని పునీత్ నివాసానికి చేరుకున్నారు.