పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం రోజు మరణించిన సంగతి అందరికి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ కు ఇద్దరు సంతానం.పెద్ద కూతురు ధృతి పై చదువుల కోసం రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లడం జరిగింది.అయితే తండ్రి మరణ వార్త వినగానే ధృతి న్యూయార్క్ నుంచి బయలు దేరి ఈ రోజు మధ్యాన్నం ఢిల్లీ కి చేరుకున్నారు.అక్కడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు
ఢిల్లీలో ధృతి బెంగళూరు వెళ్లేందుకు కర్ణాటక భావం అధికారులు బోర్డింగ్ పాస్ సిద్ధం చేయించి ఆమెకు సహకరించినట్లు సమాచారం.పునీత్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి అని ముందుగా ప్రకటించటంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆదివారం రోజున పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయని అధికారికంగా ప్రకటించటం జరిగింది.
ముఖ్యమంత్రి బొమ్మై ఆదివారం రోజున పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి ,పునీత్ అభిమానులు,ప్రజలు శాంతియుతంగా సంయమనంతో పునీత్ కు నివాళులు అర్పించాలి అని అభిమానులకు,ప్రజలకు విజ్ఞప్తి చేసారు.అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు.