Home సినిమా తనే నన్ను పోషించింది అంటూ తన భార్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి….

తనే నన్ను పోషించింది అంటూ తన భార్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి….

0

చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచినా డైరెక్టర్ రాజమౌళి.ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.ఆయనకు ఒక్కో సినిమాకు వంద నుంచి రెండువందల కోట్లు పారితోషకం ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీ గా ఉన్నారు.దీనికి కారణం రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా కూడా భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది.ఇటీవలే రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం గ్లిమ్ప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఈ చిత్రం జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా రాజమౌళి తన భార్య గురించి కొన్ని ఆసక్తి విషయాలు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము.

ఒకప్పుడు తాను డబ్బులు సంపాదించలేకపోయిన కూడా భార్యే నన్ను పోషించింది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.ఒక్కప్పుడు భార్య ను ఆఫీసులో డ్రాప్ చేసి మల్లి సాయంత్రం ఇంటికి తీసుకువచ్చేవాడిని,ఆ సమయంలో తానే నన్ను పోషించింది అని రాజమౌళి చెప్పడం జరిగింది.ఇలా చెప్పడానికి తానూ సిగ్గుపడటం లేదని తానూ చాల సంతోషంగా బ్రతికానని రాజమౌళి చెప్పడం జరిగింది.

Previous articleప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాలీవుడ్ టాప్ 10 సినిమాల విడుదల తేదీలు ఇవే….
Next articleపెయింటింగ్ వేస్తూ సందడి చేసిన అల్లు అర్జున్ భార్య, పిల్లలు….ఫోటోలు వైరల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here