Home సినిమా తన ప్రెగ్నన్సీపై వస్తున్నా రూమర్స్ గురించి స్పందిస్తూ అసలు విషయం చెప్పిన కాజల్ అగర్వాల్.!

తన ప్రెగ్నన్సీపై వస్తున్నా రూమర్స్ గురించి స్పందిస్తూ అసలు విషయం చెప్పిన కాజల్ అగర్వాల్.!

0

లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా హీరోయిన్ కాజల్. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది కాజల్.దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడిగా నటించింది కాజల్.ఇటీవలే కాజల్ తన స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ తన హవా ను కొనసాగిస్తుంది కాజల్.పెళ్లి అయినా తర్వాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవలే తాజాగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు సామజిక మాధ్యమాల్లో వినిపించాయి.అయితే ఈ రూమర్స్ పై తాజాగా కాజల్ స్పందించటం జరిగింది.ఇప్పుడు నా ప్రెగ్నన్సీ పై మాట్లాడాలి అనుకోవడం లేదు కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండ మాట్లాడతాను.తల్లి అవడం అనేది చాల గొప్ప విషయం.నాకు తెలిసినంత వరకు ఒకవైపు ఎక్సయిట్మెంట్ కలిగిస్తూనే మరోవైపు నెర్వస్ గా కూడా ఉంటుంది.నేను నా చెల్లెలు నిషా తల్లి అయినప్పుడు తాను ఎలా ఫీల్ అయ్యిందో అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో దగ్గర నుండి చూస్తున్నాను.

నిషా పిల్లలు అయినా ఇషాన్,కబీర్ లతో నేను ఎక్కువ సమయం గడపడం జరిగింది,ఆ టైములో నేను వాళ్లతో తల్లిలాగే భావించి గడిపాను.వీళ్లిద్దరు నా జీవితంలోకి వచినప్పు నాకు సరికొత్త భావన కలిగింది.అదే ఇప్పుడు నాకు పిల్లలుపుడితే అనే భావన ఎమోషన్ ను పెంచుతుంది అని కాజల్ స్పందించారు.మరోవైపు కాజల్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.హిందీలో కూడా కాజల్ నటించిన ఉమా అనే చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

Previous articleస్నేహితురాలి కోసం సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్….
Next articleవైరల్ అవుతున్న దాక్షాయణిగా అనసూయ పుష్ప మూవీ లుక్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here