తన ఫేస్ పై ఉన్న మొటిమల గురించి మనసులో మాట బయట పెట్టిన సాయి పల్లవి…!

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా హీరోయిన్ సాయి పల్లవి.ఇటీవలే సాయి పల్లవి అక్కినేని నాగ చైతన్య కు జోడి గా లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.సాయి పల్లవి తన నటనతో ముఖ్యంగా తన డాన్స్ తో లెక్కలేనన్ని అభిమానులను సంపాదించుకుంది.ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎదగాలి అంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదంటూ నిరూపిస్తూ తన నటనతో ఎన్నో ఆఫర్లను అందుకొని బిజీ గా ఉంది.నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.

న్యాచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన అందం కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంది సాయి పల్లవి.సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పుకొచ్చింది.చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాలు రావడంతో అటు చదువుతో పాటు ఇటు సినిమాలు కూడా చేసానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.వేరే అమ్మాయిల లాగానే అందం విషయంలో తనకు కూడా కొన్ని భయాలు వెంటాడేవని ఇంటర్వ్యూ లో సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

తానూ చుసిన హీరోయిన్లు అందరు కూడా మొహం మీద ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అందంగా ఉండేవారని,తన ముఖం మీద మొటిమలు ఉండడంతో ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో భయం వేశింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.తన ముఖం పై ఉన్న మొటిమల గురించి జనాలు ఏం అనుకుంటారో అంటూ చెప్పింది.కానీ ప్రేక్షకులు చూసేది నటన కానీ అందం కాదు అని ఇప్పుడు తెలిసింది అంటూ సాయి పల్లవి చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *