తన రెండో పెళ్లిపై వస్తున్నా రూమర్స్ కు అదిరిపోయేలా సమాధానం ఇచ్చిన మంచు మనోజ్.ఇంతకూ ఏమన్నాడంటే….!


మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని 2015 ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వలన నాలుగు ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత మనోజ్,ప్రణతి జంట విడిపోవడం జరిగింది.ఈ జంట 2019 అక్టోబర్ లో విడాకులు తీసుకోని విడిపోయారు.ఇటీవలే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

బంధువులు,సన్నిహితులు మనోజ్ ను రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నారని,మనోజ్ ఒక ఫారెన్ అమ్మాయితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.వస్తున్నా రూమర్స్ కు స్పందిస్తూ మనోజ్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ఒక పంచ్ ను వేశారు.మంచు మనోజ్ చేసిన ట్వీట్ లో నేను చేసుకోబోతున్న రెండో పెళ్ళికి నన్ను కూడా ఆహ్వానించండి.

పెళ్లి ఎక్కడ జరుగుతుంది?ఆ బుజ్జి పిల్ల,తెల్ల పిల్ల ఎవరు అంటూ?మనోజ్ పంచ్ వేయడం జరిగింది.దానితో పాటు మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం అంటూ మనోజ్ ట్వీట్ చేసారు.ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విడాకుల తర్వాత నుంచి కూడా మంచు మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు.ప్రస్తుతం మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *