తల్లి మాట విని నరసింహ లో నీలాంబరి పాత్రకు నో చెప్పిన స్టార్ హీరోయిన్…


ఒక సినిమా కథను రాసుకునే ముందు అందులో ఉన్న పాత్రలకు విల్లు అయితే సరిగ్గా సరిపోతారు అని దర్శకులు భావిస్తారు.అన్ని కుదిరి వాళ్ళు కూడా డేట్స్ అడ్జస్ట్ చేసిన తర్వాతే సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అనుకున్న వాళ్ళు దొరకకపోయిన దొరికిన వాళ్ళతోనే సినిమా చేయడం జరుగుతుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనా గురించి అందరికి తెలిసే ఉంటుంది.ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మీనా ను దృష్టిలో పెట్టుకొని రాసిన మంచి మంచి క్యారెక్టర్లను మీనా తన తల్లి మాట విని నో చెప్పారంట.

అందులో ఒకటి నిన్నేపెళ్లాడతా సినిమాలో హీరోయిన్ టబు క్యారక్టర్ కోసం కృష్ణవంశీ ముందుగా మీనా ను అనుకున్నారట.కానీ మీనా తల్లి నో చెప్పడంతో మీనా ఆ ఆఫర్ ను వదులుకున్నారట.రెండోది రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్రలో ముందుగా మీనాను అనుకున్నారట దర్శకుడు.కానీ ఇది కూడా మీనా తల్లి నో చెప్పడంతో మీనా వదులుకోవడం జరిగింది.

అయితే అప్పట్లో మీనా తన తల్లి మాటకు కట్టుబడి,గౌరవం ఇచ్చి తన తల్లి చెప్పిన నిర్మాతలకు డేట్స్ అడ్జస్ట్ చేసేవారట.తనకు ఇష్టం లేకపోయినా కూడా తన తల్లి మాటకు ఓకే చెప్పేవారట మీనా.అయితే ముందుగా ఎవరిని అనుకున్న సరే నరసింహ సినిమా చూసిన తర్వాత మాత్రం నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణ తప్ప మరెవ్వరు న్యాయం చేయలేరు అనే చెప్పచు.నీలాంబరి పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర అనే చెప్పాలి.ఆ పాత్ర రమ్యకృష్ణ నటిగా మంచి పేరు తీసుకొచ్చింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *