బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో తారే జమీన్ పర్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమాకు ఆయనే దర్శకుడిగా కూడా వ్యవహరించారు.ఎనిమిది ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక బాలుడు వేరే పిల్లలతో పోలిస్తే తక్కువ యాక్టివ్ గా ఉండడం,మానసిక రుగ్మతతో మెదడు అంతగా ఎదగని ఒక బాలుడి కథే ఈ తారే జమీన్ పర్.ఈ సినిమాతో దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు అమీర్ ఖాన్.ఈ సినిమాలో ఇషాన్ అవస్తిగా కనిపించిన ఆ బుడ్డోడి పేరు దర్శిల్ సఫారీ.
తన సమస్య ఎంతో కూడా తనకే తెలియని పరిస్థితుల్లో ఉండే ఇషాన్ అవస్తి పాత్రకు ప్రాణం పోసాడు దర్శిల్.దర్శిల్ చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత భమ్ భమ్ భోలే,జోక్కుమోన్ వంటి చిత్రాలలో కూడా దర్శిల్ నటించడం జరిగింది.
అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి తన చుదువుపైనే దృష్టి పెట్టాడు దర్శిల్.మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత దర్శిల్ చేసిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియొ లో దర్శిల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.తాజాగా దర్శిల్ ఫోటోలు మరియు వీడియోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram