బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు.ఎప్పటి నుంచో సుడిగాలి సుధీర్ పెళ్లి కి సంబంధించి చాల వార్తలు సామజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.అయితే సుధీర్ యాంకర్ రష్మిని ఇష్టపడుతున్నాడని,అందుకే తన పెళ్లి గురించి ఆలోచించటం లేదు అని చాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఆటో రామ్ ప్రసాద్,గెట్ అప్ శ్రీను తన స్నేహితుడు అయినా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి చాల ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం.సుధీర్ వయస్సు 34 ఏళ్ళు దాటుతుండడంతో సుధీర్ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్లు తెలుస్తుంది.సుధీర్ కు తన దగ్గర బంధువుల ద్వారా ఒక సంబంధం కుదిరిందని,సుధీర్ కు బాగా నచ్చి ఓకే చేసాడని ఇలా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
సుధీర్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి సుధీర్ సొంత జిల్లాకు చెందిన అమ్మాయే అని కూడా వార్తలు వస్తున్నాయి.అయితే సుధీర్ పెళ్లి కోసం అతని స్నేహితులు,కుటుంబసభ్యులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.తన పెళ్లి విషయం పై సుధీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏది ఏమైనా కూడా సుధీర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని తెలుస్తుంది.