దృశ్యం 2 మూవీ రివ్యూ….సినిమా ఎలా ఉందంటే…

దృశ్యం సినిమా ముందుగా మలయాళీ భాషలో తెరకెక్కి విజయం సాధించిన తర్వాత ఇతర భాషలైన తెలుగు,తమిళం,హిందీ,కన్నడ భాషలలో రీమేక్ చేయబడి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.దృశ్యం 2 ఫ్యామిలీ థ్రిల్లర్ ఇటీవలే ఓటిటీ లో రిలీజ్ అయ్యి విజయం సాధించింది.అయితే ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబడిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 25 న విడుదల అయ్యింది.

కథ:దృశ్యం సినిమాలో క్లైమాక్స్ లో డిజిపి కొడుకు శవాన్ని పోలీస్ స్టేషన్ కింద రాంబాబు దాచి పెట్టడం జరుగుతుంది.అయితే ఈ దృశ్యం 2 సినిమా ఆ శవం బయట పడే సందర్భం నుంచి స్టార్ట్ అవుతుంది.పోలీసులతో పాటు రాజవరం గ్రామం మొత్తం కూడా రాంబాబు కుటుంబం మీద అసూయతో ఉంటారు.ఆరు సంవత్సరాల తర్వాత ఈ కేసు మల్లి మొదలవుతుంది.పోలీసులు మరియు రాజవరం గ్రామం వారు అందరు రాంబాబు కి వ్యతిరేకంగా ఉండడంతో రాంబాబు కు ఈ కేసు నుంచి బయట పడటం కష్టం అవుతుంది.అయితే ఈ కేసు నుంచి రాంబాబు ఎలా పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు,అసలు శవాన్ని ఏం చేసాడు అనే మొత్తం సినిమా కథాంశం.

పాత్రల పనితీరు:గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తూ పైకి సగటు తండ్రిగా తన కుటుంబాన్ని కాపాడుకునే రాంబాబు పాత్రలో వెంకటేష్ చాల అద్భుతంగా నటించారు.రాంబాబు పాత్రకు ఆయన తప్ప మరెవ్వరు న్యాయం చేయలేరు అనేంతగా పాత్రకు ప్రాణం పోశారు వెంకటేష్.ఇగోయిస్టు పోలీసుగా,తల్లిగా నదియా కూడా పాత్రలో ఒదిగి పోయారు.సత్యం రాజేష్,తనికెళ్ళ భరణి,సంపత్ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం గురించి:మాలయంలో ఆల్రెడీ హిట్ అయినా సినిమాను మల్లి అదే సస్పెన్స్ కొనసాగిస్తూ తిరిగి తెలుగు లో రీమేక్ చేయడం అనేది మాములు విషయం కాదు.జీతూ జోసెఫ్ తన ప్రతిభను చూపించారు.సినిమా కథ మొత్తం తిరిగేది రాంబాబు పాత్ర చుట్టే అయినా కూడా ఇందులో ప్రతి పాత్ర కూడా చాల ఇంపార్టెంట్ ఉన్న పాత్ర అని చెప్పచ్చు.అనూప్ రూబెన్స్ సంగీతం కొంత తడపడిన కూడా పర్వాలేదని పించింది.ఆర్ట్ వర్క్ మరియు కెమెరా వర్క్ కూడా బాగున్నాయి.దృశ్యం 2 ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్ళకి ఇది మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పచు.
రేటింగ్:4/5 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *