దృశ్యం 2 లో ముఖ్య పాత్రలో కనిపించిన సరితా ఇంతకీ ఎవరంటే…!

వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 సినిమా నవంబర్ 25 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.మలయాళంలో ఒరిజినల్ వెర్షన్ నుంచి రీమేక్ చేయబడిన ఈ చిత్రం ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కబడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది.శవాన్ని రాంబాబు ఎక్కడ దాచిపెట్టాడో తెలియని పరిస్థితుల్లో కేసు ముగిసిన తర్వాత మల్లి కేసు రీ ఓపెన్ చేయగా రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం.

జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్,ఆశీర్వాద సినిమాస్ నిర్మించడం జరిగింది.ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో మీనా,నదియా నటించడం జరిగింది.ఈ సినిమా మొత్తం తిరిగేది హీరో అయినా రాంబాబు పాత్ర చుట్టే.అయినా కూడా ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా ముఖ్య పాత్ర అనే చెప్పచ్చు.ఈ సినిమాలో సరితా అనే మరో ముఖ్య పాత్రలో నటించింది సుజా వరుని.దృశ్యం 2 సినిమాలో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న సుజా వరుని ఎవరు అనే దాని పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.తమిళ్ లో ప్లస్ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టింది సుజా వరుని.

ఆ తర్వాత తమిళం,కన్నడ,మలయాళం,తెలుగు చిత్రాలలో కూడా నటించడం జరిగింది.తెలుగులో వెంకటేష్ హీరోగా చేసిన నాగవల్లి చిత్రంలో హేమ అనే చిన్న పాత్రలో కనిపించింది సుజా వరుని.ఆ తర్వాత తెలుగులో గుండెల్లో గోదారి,దూసుకెళ్తా,ఆలీబాబా ఒక్కడే దొంగ అనే చిత్రాల్లో నటించింది.అయితే ఇవేమి ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు అనే చెప్పాలి.తాజాగా రిలీజ్ అయినా దృశ్యం 2 సినిమా ఆమెకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది.తమిళ్ లో కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షో లో 91 రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యింది.ఈమె స్టార్ హీరో అయినా శివాజీ గణేశన్ మనవడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.ఈ జంటకు అద్వైత్ అనే కొడుకు కూడా ఉన్నాడు.సోషల్ మీడియాలో కూడా సుజా వరుని యాక్టీవ్ గా ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *