దేవిపుత్రుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ లుగా ఎదిగారు.కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మాత్రం ఒకటి రెండు సినిమాల్లో కనిపించి ఆ తర్వాత కనుమరుగైపోయారు.దేవి పుత్రుడు సినిమాలో చేసిన చిన్నారి అందరికి బాగా గుర్తుండే ఉంటుంది.వెంకటేష్,సౌందర్య,అంజనా జవేరి నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం 2001 లో రిలీజ్ అయ్యి అనుకున్నంత సక్సెస్ సాధించలేక పోయింది.

Advertisement

ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారకా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.ఇందులో ఒక ముఖ్య పాత్రలో వేగా తమోతియా అనే చిన్నారి నటించింది.వేగా తమోతియా అంటే చాల మంది గుర్తుపట్టలేక పోవచ్చు కానీ దేవి పుత్రుడు చిన్నారి అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.

దేవి పుత్రుడు సినిమా వేగా తమోతియా కు నటన పరంగా చాల మంచి పేరు తెచ్చిపెట్టింది.అందులో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆ చిన్నారి చేసిన నటన కానీ పాటలు కానీ ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి.ఆ దేవి పుత్రుడు చిన్నారిని ఇప్పుడు చుస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టలేరు.అందంగా ఉన్న వేగా తమోతియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *