నటుడిగా రాజమౌళి నటించి ఫ్లాప్ అందుకున్న సినిమా ఏదో తెలుసా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి కి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాహుబలి సినిమాతో రాజమౌళి కి ఉన్న ఫాలోయింగ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటేనే చాలు ప్రేక్షకులు చాల ఆసక్తిగా ఎదురు చూసే విధంగా పెరిగిపోయింది ఆయన క్రేజ్.భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం జనవరి 7 న రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే.అప్పట్లో జరిగిన ఈగ ఆడియో ఫంక్షన్ లో నాని రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయనలో మంచి దర్శకుడే కాదు మంచి నటుడు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు.

ఇదే విషయం గురించి రాజమౌళి కూడా మగధీర సినిమా టైములో మాట్లాడినప్పుడు మేకింగ్ వీడియొ లతో ఆ సరదా తీర్చుకుంటున్నాను అని చెప్పడం జరిగింది.రాజమౌళి తానూ దర్శకత్వం వహించిన సై మరియు బాహుబలి మొదటి భాగంలో చిన్న కేమియో రోల్స్ చేయడం జరిగింది.అలాగే వేరే దర్శకులు తెరకెక్కించిన మజ్ను మరియు రైన్ బో చిత్రాలలో కూడా రాజమౌళి నటించడం జరిగింది.

అందులో నాని హీరో గా నటించిన మజ్ను చిత్రం బాగానే విజయం సాధించింది కానీ వి యెన్ ఆదిత్య తెరకెక్కించిన రైన్ బో చిత్రం మాత్రం ప్లాప్ అవ్వడం జరిగింది.అయితే రాజమౌళి ఇప్పటి వరకు దర్శకుడిగా ప్లాప్ అందుకోలేదు కానీ నటుడిగా మాత్రం ఒక సినిమా ప్లాప్ అయ్యియిందనే చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *