పార్టీలో టేబుల్ ఎక్కి డాన్స్ చేస్తూ రచ్చ చేసిన హీరోయిన్ అక్క…వీడియొ వైరల్.


తెలుగు చిత్ర పరిశ్రమలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లోఫర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని.మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది దిశా పటాని.ఆమె హిందీలో ఎంఎస్ ధోని,భాగీ వంటి చిత్రాలలో నటించడం జరిగింది.దిశా పటాని అక్క పేరు ఖుష్బూ పటాని.ఖుష్బూ పటాని సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఆమెకు సోషల్ మీడియాలో చాల ఫాలోయింగ్ ఉంది.

దిశా పటాని మరియు అక్క ఖుష్బూ పటాని ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటారు.తమకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మరియు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.ఇటీవలే ఖుష్బూ పటాని పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు కలిసి పార్టీలో రచ్చ చేసిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పుట్టిన రోజు సందర్భంగా ఖుష్బూ పటాని పార్టీలో టేబుల్ పైకి ఎక్కి డాన్స్ చేసిన వీడియొ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇంస్టా గ్రామ్ ఖాతాలో దిశా పటాని ఈ వీడియోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మై క్రేజీ సిస్,నీలా నేను కూడా డాన్స్ చేయాలనీ కోరుకుంటున్న అని పోస్ట్ చేసారు.ఈ వీడియోలో ఖుష్బూ పటాని సల్మాన్,కత్రినా పాటకు స్టెప్పులేసింది.ఈ వీడియోను చుసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కొందరు ఖుష్బూ పటాని డాన్స్ కు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు తాను ఒక ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయి డాన్స్ చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటె ఖుష్బూ పటాని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ లో లెఫ్టునంట్ గా తన విధులను నిర్వర్తిస్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *