Home ఆధ్యాత్మికం పిల్లలకు పేరు పెట్టే ముందు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన 5 విషయాలు..!

పిల్లలకు పేరు పెట్టే ముందు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన 5 విషయాలు..!

0

చాల మంది తల్లితండ్రులు కడుపులో బిడ్డ పడినప్పటినుంచే తమ పిల్లలకు ఏం పేరు పెట్టాలో ఆలోచించుకుంటారు.అయితే బాబు పుడితే ఒకటి మరియు పాప పుడితే ఒక పేరు ముందుగానే అలోచించి పెట్టుకుంటారు తల్లితండ్రులు.అయితే జ్యోతిష్యం ప్రకారం సరైన పేరు ఆలోచించి పెడతారు చాల మంది తల్లితండ్రులు.సనాతనధర్మంలోని పదహారు మత కర్మలలో నామకరణం కూడా ఒకటి అన్న విషయం అందరికి తెలిసిందే.పిల్లలకు పెట్టె పేరు వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోతుంది.అలాగే పేరు ప్రభావం ఆ పిల్లల జీవితం,ప్రవర్తన మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది.అయితే జ్యోతిష్య నియమాలను పాటించి పిల్లలకు పేరు పెట్టినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.అవి ఏంటంటే..

సరైన రోజు చూసి పేరు పెట్టడం:
సాధారణంగా అయితే బిడ్డ పుట్టిన తర్వాత పదకొండవ కానీ పదహారవ రోజున కానీ బిడ్డకు నామకరణం చేస్తారు.ఏదైనా శుభ తేదీని నిర్ణయించి కూడా పేరు పెట్టవచ్చు.కానీ అమావాస్య లేక పూర్ణిమ రోజున మాత్రం అస్సలు పేరు పెట్టకూడదు.

రాశిచక్రం చూసి:
పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జాతకాన్ని చూసి నిపుణులు పేరు అక్షరాన్ని చెప్పడం జరుగుతుంది.ఆ అక్షరాన్ని గ్రహం మరియు రాశి చక్రం ప్రకారం నిర్ణయిస్తారు నిపుణులు.

నక్షత్రం ప్రకారం:
పేరు సరైన నక్షత్రంలో పెట్టాలి అని నిపుణులు సూచిస్తారు.

ఎంచుకున్న పేరు అర్ధవంతంగా ఉండాలి:
ఇష్టానుసారంగా ఇంటర్నెట్లో చూసి పేరు నిర్ణయించడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.పేరు లోని అర్ధం ఆ పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి పేరు అర్ధవంతంగా ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు.

పేరు స్పెల్లింగ్ కూడా సరైనదిగా ఉండాలి:
న్యూమరాలజీ ఒక వ్యక్తి భవిష్యత్తును చాల చెప్తుంది.ఈ న్యూమరాలజీ లో పేరుకు చాల ప్రాముఖ్యత ఉన్న విషయం అందరికి తెలిసిందే.చాల మంది ప్రముఖులు తమ పేర్ల స్పెల్లింగులను సవరించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.పండితులు పేరు మొదటి అక్షరాన్ని నిర్ణయించిన తర్వాత న్యూమరాలజీ నిపుణుల సహాయంతో పేరు స్పెల్లింగ్ సరైనదిగా ఉండేలా చూసుకోవాలి.

Previous articleసినిమాల్లోకి రాకముందు స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా…
Next articleకార్తీక దీపం హిమ,సౌర్యకు రోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here