జీవితంలో ప్రతి మనిషి వారి యొక్క రాశిని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్పగలరు నిపుణులు.అలాగే చాల మంది వారు పుట్టిన నెలను బట్టి కూడా వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో సర్వే చేసి చెప్పడింది.అందులో మొదటిది…
జనవరి నెలలో పుట్టిన వారికి పట్టుదల చాల ఎక్కువగా ఉంటుందట.వీళ్ళు ఏమైనా సాధించాలి అనుకుంటే అది సాధించేవరకు వదిలిపెట్టరు.అలాగే వీళ్ళు అందంగా కూడా ఉంటారు.జనవరి నెలలో పుట్టిన వారికి ఎక్కడ తగ్గాలో మరియు ఎక్కడ నెగ్గాలో అనే విషయం బాగా తెలుసు అని సర్వే లో నిరూపించబడింది.
ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారట.అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది.పక్కన ఉన్న వాళ్ళ పై కోప్పడి వెంటనే నవ్వేసే మనస్తత్వం కలిగి ఉంటారు.
మార్చ్ నెలలో పుట్టిన వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే వీళ్ళు కళా హృదుయులు కూడా.వీళ్ళు ఏదైనా విషయానికి తొందరగా రియాక్ట్ అవుతారు.
ఏప్రిల్ నెలలో పుట్టిన వారు సున్నితమైన మనసు కలిగి పక్కవాళ్ళతో కలిసి పని చేయడానికి బాగా ఇష్టపడతారు.
మే నెలలో పుట్టిన వారు ప్రేమ విషయంలో వీక్ గా ఉంటారని చెప్పచ్చు.తొందరగా పక్కన ఉన్న వాళ్ళని నమ్మేస్తుంటారు.అందరిపై ప్రేమను ఒకే రకంగా చూపిస్తారు.దేనికైనా కూడా తొందరగా ఆకర్షింప బడతారు.
జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు తమ చుట్టూ జనాలు ఉండాలి అని అనుకుంటారు.కొత్త వాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు.
జులై నెలలో పుట్టిన వారికి అహంకారం కొద్దిగా ఎక్కువ.మేమె అన్ని చేయాలి అని అనుకుంటారు.గొప్ప పేరు సంపాదించాలి అని కూడా అనుకుంటారు.కొన్ని కొన్ని సార్లు అనుకున్నది జరగక పొతే నిరుత్సాహపడతారు.వాళ్లకు ఉన్న కొద్దిగా అహంకారం కారణంగా సన్నిహితులు వాళ్ళు దూరం కావచ్చు.
ఆగష్టు నెలలో పుట్టిన వారికి సంగీతం అంటే చాల ఇష్టం.జీవితంలో అలా కావాలి ఇలా కావాలి అంటూ కళలు కంటూ ఉంటారు.ఏమైనా అనుకున్నప్పుడు తిరక పొతే బాధపడతారు.ఈ నెలలో పుట్టిన వారికి అనుమానం కూడా ఎక్కువే.ప్రతి విషయానికి అనుమానంతో చూస్తారు.ఆ అనుమానం తొలగిపోయిన తర్వాతే ఆ పని చేస్తారు.పక్కన వాళ్లతో యెంత సరదాగా ఉంటారో అంత రహస్యాలు కూడా దాచుకుంటారు.
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు తమ స్నేహితుల సమస్యలు తెలుసుకొని వారిని ఓదార్చే మనస్తత్వం.చాల తెలివి కల వారు.భయం అంటే తెలియదు.మన అనుకున్న వాళ్ళని చాల కేరింగ్ గా చూసుకునే మనస్తత్వం.
అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు స్నేహితులను తొందరగా బాధపెట్టిన కూడా వెంటనే కలిపేసుకుంటారు.చాల స్మార్ట్ గా ఉంది అందరిచేత ఆకర్షింపబడతారు.కొన్ని సార్లు అబద్ధం చెప్తారు కానీ నటించరు.చాటింగ్ చేయడానికి ఇష్టపడతారు.
నవంబర్ నెలలో పుట్టిన వారు నమ్మదగిన వారు.విశ్వాసం కూడా ఎక్కువ.ఏదైనా చేయాలి అనుకుంటే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.కలివిడిగా ఉంటారు కానీ సీక్రెట్స్ చెప్పరు.స్వత్రంతంగా ఉండాలి అనుకుంటారు.
డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అన్ని విషయాలలోనూ చాల ఉన్నతంగా ఉంటారు.చూడడానికి బాగుంటారు అలాగే విశ్వాసం కూడా ఎక్కువ.ఉదారమైన మనసు కలవారు.ప్రతి విషయంలోనూ పోటీ పడతారు.ప్రేమ గా ఉంటారు కాని చాల తొందరగా హర్ట్ అవుతారు.