Home సినిమా పునీత్ నీ మిత్రుడిగా ఆ 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను అంటున్న హీరో...

పునీత్ నీ మిత్రుడిగా ఆ 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను అంటున్న హీరో విశాల్..!

0

తమిళ స్టార్ హీరో అయినా విశాల్ నటించిన చిత్రం ఎనిమి చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4 న విడుదల కాబోతుంది.ఈ సినిమాలో విశాల్ తో పాటు ఆర్య కూడా మరొక హీరోగా నటిస్తున్నారు.అయితే ఎనిమి చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న ఆదివారం రోజున హైదరాబాద్ లో జరిగింది.ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇండస్ట్రీ కే కాదు ఈ సమాజానికి కూడా తీరని లోటు.పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పుకొచ్చారు విశాల్.

పునీత్ లాంటి మనిషిని నేను ఎప్పుడు కలవలేదు ఆయన ఇంట్లో ఉన్న సరే బయట ఉన్న సరే కూడా ఒకేలాగా ఉంటారు.మేక్ అప్ వేసుకున్న లేకపోయినా కూడా ఒకేలాగా ఉంటారు అని చెప్పారు విశాల్.పునీత రాజ్ కుమార్ అనాధాశ్రమం,వృధాశ్రమం తో పాటు 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేస్తున్నా గొప్ప మనసున్న వ్యక్తి.ఇకపై పునీత్ నీ స్నేహితుడిగా ని సేవాకార్యక్రమాలు నేను కొనసాగిస్తాను.

ఆ 1800 పిల్లలను నేను చదివిస్తాను.ఆ పిల్లల బాగోగులు నేను చూసుకుంటాను అని హీరో విశాల్ చెప్పడం జరిగింది.ఇక విశాల్ సినిమా విషయానికి వస్తే ఎనిమి చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నాను.ఇప్పటికే ఎనిమి ట్రైలర్,టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతుంది.ఈ చిత్రం ఒకేసారి తమిళం,హిందీ మరియు తెలుగులో రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here