పుష్పలో స్పెషల్ సాంగ్ చేయనున్న సమంత…రెమ్యూనరేషన్ ఎంతంటే.


భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్,సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ లో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలలో విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందాన నటిస్తున్నారు.డిసెంబర్ 17 పుష్ప మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు చిత్ర నిర్వాహకులు.అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాల వేగంగా జరుగుతున్న సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నారు.

దీనికి సంబంధించిన మరొక కొత్త అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ చిత్రం లో హీరోయిన్ సమంత ఒక సాంగ్ చేయనున్నారని ముందుగానే వార్తలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అనుకున్నట్టు గానే సమంత ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నారని సమాచారం.ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది.ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం సమంత బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

Pushpa allu arjun new look

ఈ చిత్రంలో ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్ ను నవంబర్ 19 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్వాహకులు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ యెర్ర చందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు.మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.సునీల్ మరియు యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.ఇప్పటి వరకు రిలీజ్ అయినా ఈ చిత్రంలోని పాటలు మరియు గ్లిమ్ప్స్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *