తెలుగు చిత్ర పరిశ్రమకు నువ్వే కావలి చిత్రం తో కమెడియన్ సునీల్ ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత కమెడియన్ గా చాల సినిమాలలో చేయడం జరిగింది.కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు చిత్రంలో హీరో గా చేసే ఛాన్స్ కొట్టేసాడు.ఈ సినిమాలో సునీల్ కు జంటగా ఆర్తి అగర్వాల్ నటించారు.అయితే హీరోగా వరుసగా అవకాశాలు అందుకున్న తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అవడంతో సునీల్ కు అవకాశాలు తగ్గిపోయాయి అనే చెప్పచ్చు.
ఆ తర్వాత హీరోలకు అన్నయ్య వంటి పాత్రలు కూడా చేసాడు సునీల్.ప్రస్తుతం సునీల్ సుకుమార్ తెరకెక్కిస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఇటీవలే పుష్ప సినిమాలో సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర నిర్వాహకులు.
ఆ పోస్టర్లో సునీల్ బట్టతలతో,కోపంగా ఎక్స్ ప్రెషన్స్ తో ఉండడం అందరికి సునీల్ పాత్ర మీద ఆసక్తిని కలిగించింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత మల్లి సునీల్ కు ఇదివరకటిలాగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అని టాక్ వినిపిస్తుంది.అయితే పుష్ప సినిమా కోసం సునీల్ 80 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.ఈ సినిమాలో సునీల్ కు భార్యగా ప్రముఖ యాంకర్ అనసూయ నటిస్తున్నారు.