సామజిక మాధ్యమాల్లో ఈ మధ్య కాలంలో పెళ్లిలో వధూ,వరుల ఫోటోలు కానీ ప్రీ వెడ్డింగ్ వీడియోలు చాల వైరల్ అవుతున్నాయి.అలాగే పెళ్లిళ్లలో జరిగే సరదా వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే దర్శనం ఇస్తున్నాయి.సాధారణంగా పెళ్లి అంటే వధువు ఖరీదైన పెళ్లి దుస్తులు ధరించి,నగలు వేసుకొని అందంగా ఫోటో షూట్ లో ఫోటోలు దిగడానికి ఇష్టపడతారు.పెళ్ళికి ఒక గంట ముందు అంటే వధువు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో బిజీగా ఉంటారు.
కానీ ఒక వధువు మాత్రం పెళ్ళికి ఖరీదైన దుస్తులు ధరించి,నగలు ధరించి,మేక్ అప్ వేసుకొని పెళ్ళికి ఒక గంట ముందు జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ బిజీ గా ఉంది.దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియొ చుసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కొందరు నెటిజన్లు ఆ వధువుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వీడియోను ఒక ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఆజ్ రాజ్ క ఖులా హిమ్మత్ కా అనే ఫన్నీ కాప్షన్ తో పోస్ట్ చేసారు.ఈ వీడియొ చుసిన నెటిజన్లు వధువు పెళ్ళికి ఒక గంట ముందు ఇలా జిమ్లో వర్క్ ఔట్స్ చేయడం పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Pre-wedding shoot…👇
Aaj raaz khula himmat ka……. pic.twitter.com/1d9bJDVMqa
— Rupin Sharma IPS (@rupin1992) November 19, 2021