పెళ్ళిలో పెళ్ళికొడుకు అరెస్ట్..దింతో పెళ్లికూతురు చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్…

అందరు బంధువుల మరియు సన్నిహితుల సమక్షంలో మరికాసేపట్లో వరుడు వధువు చేతికి ఉంగరం తొడుగుతాడు అనగా ఊహించని విధంగా పెళ్లి మండపంలోకి పోలీసులు వచ్చారు.ఈక్వెడార్ లోని ఎల్ గూవబో క్యాన్తాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ఆ నగరంలోని ఒక యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది.పెద్దలను ఒప్పించి ఇద్దరు కూడా అందరి సమక్షంలో చర్చ్ లో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు.అయితే మరికాసేపటిలో పెళ్లి జరుగుతుంది అనగా పోలీసులు అక్కడికి వచ్చి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లారు.

పెళ్ళికొడుకుని అరెస్ట్ చేయడంతో వధువు ఒక్కసారిగా షాక్ కు గురైంది.ఏం చేయాలో వధువుకు అర్ధం కాలేదు.నా భర్తను వదిలిపెట్టండి అంటూ కారు వెంట పరుగులు తీసింది.వధువు కారు వెనకాల పరిగెత్తిన కూడా ప్రయోజనం లేకపోయింది.పోలీసులు వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.అయితే ఆ వరుడికి ఇదివరకే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట.భార్య భర్తల మధ్య గొడవల కారణంగా వారిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవడం జరిగింది.

అయితే విడిపోయిన తరువాత భర్త ఆమెకు ఇస్తాన్న భరణం ఇవ్వలేదు మరియు పిల్లలకు అయ్యే ఖర్చుకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం తో ఆమె మాజీ భార్య అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.దింతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం జరిగింది.అయితే పెళ్లి కొడుకుని అరెస్ట్ చేయడంతో ఆ కారు వెంట వధువు పరిగెత్తిన వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇది చుసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.నా భర్తను వదిలేయండి అంటూ వధువు పరుగెత్తడంతో నెటిజన్లు ఆమెకు భర్త మీద యెంత ప్రేమ ఉందొ అని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *