స్మార్ట్ ఫోన్ లు,సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఏ వింత పనికి సంబంధించిన వీడియొ షేర్ చేసిన కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.పెళ్లిళ్లకు సంబంధించిన సరదా వీడియోలు,జంతువులూ చేసే అల్లరి వీడియోలు ఇలా పలు రకాల వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా దర్శనం ఇస్తున్నాయి.అయితే ఇవన్నీ చూసి నప్పుడు నిజంగానే ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.అయితే చాల మంది లైకులు మరియు కామెంట్స్ కోసం వింత వింత పనులు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అవి నెటిజన్లకు నచ్చితే క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.తాజాగా ఇటీవలే ఒక యువకుడు చేసిన వీడియొ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఎవరైనా స్నానం చేసి వచ్చినప్పుడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్ ను ఉపయోగిస్తారు.కానీ ఈ వీడియోలో ఒక యువకుడు మాత్రం స్నానం చేసి వచ్చిన తర్వాత హెయిర్ డ్రైయర్ కు బదులుగా ప్రెషర్ కుక్కర్ తో తన జుట్టును ఆరబెట్టుకుంటున్నాడు.అయితే ఈ వీడియొ ను చుసిన నెటిజన్లు మాత్రం రక రకాలుగా స్పందిస్తున్నారు.
హెయిర్ డ్రైయర్ కు బదులుగా ప్రెషర్ కుక్కర్ ను ఎవరైనా యూస్ చేస్తారా,కుక్కర్ పగిలిపోయే ప్రమాదం ఉందని కొంత మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరికొంత మంది నెటిజన్లు అతను జుట్టు ఆరబెట్టుకునే విధానం చూసి ఇష్టపడుతున్నారు.ఇలా ఈ విధంగా ఆ యువకుడు జుట్టు ఆరబెట్టుకునే వీడియొ black lover ox అనే అకౌంట్ లో షేర్ చేయబడింది.వీడియోకు అధికంగా షేర్లు కూడా పడుతున్నాయి.
View this post on Instagram