కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కోలుకొని మెల్లగా థియేటర్లకు వెళ్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి థియేటర్లు మల్లి మూసివేయడం జరిగింది.దింతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన చాల సినిమాలు ఈ కరోనా కారణంగా విడుదలకు మరింత ఆలస్యం అయ్యాయి.చాల సినిమాల విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచిచూస్తున్నారు.అవి ఏంటో ఎప్పుడు విడుదల అవుతాయో చూద్దాం…
1 .ట్రిపుల్ఆర్ : పాన్ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రం జనవరి 7 ,2022 న విడుదల కానుంది.
2 .ఆచార్య :ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య చిత్రం ఫిబ్రవరి 4 ,2022 న విడుదల కానుంది.
3 .కెజిఫ్ 2 :ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 ,2022 న విడుదల చేస్తున్నారు చిత్ర నిర్వాహకులు.
4 .పుష్ప : అల్లుఅర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 17 ,2021 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
5 .రాధే శ్యామ్ :ప్రభాస్,పూజ జంటగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 14 ,2022 న విడుదల కానుంది.
6 .సలార్: ఈ చిత్రం వచ్చే సంవత్సరం 2022 లో విడుదల కానుంది.
7 . భీమ్లా నాయక్:ఈ చిత్రాన్ని జనవరి 12 ,2022 లో విడుదల చేయనున్నారు చిత్ర నిర్వాహకులు.
8 .సర్కారు వారి పాట: మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం 2022 మార్చ్ లో విడుదల కానుంది.
9 .లైగర్:విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 లో విడుదల కానుంది.
10 .అఖండ:నందమూరి బాలకృష హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2021 లో విడుదల కానుంది.