ప్రేమించి పెళ్లివరకు వచ్చి నిలిచిపోయిన 8 మంది సెలెబ్రెటీలు వీళ్ళే..

NEWS DESK
2 Min Read

సినిమా ఇండస్ట్రీలో చాల మంది నటి నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.అలాగే ప్రేమించి ఇంట్లో అందరు పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం చేసుకొని ఆ తర్వాత పెళ్లి దాకా వచ్చి విడిపోయిన వారు కూడా చాలనే ఉన్నారు.పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోను చాల ముఖ్యమైనది.సరైన భాగస్వామిని ఎంచుకున్నప్పుడే ఆ వైవాహిక జీవితం ఏ ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది.ఇలా నిశ్చితార్ధం కూడా చేసుకొని పెళ్లి కూడా అయిపోతుందిలే అన్న సమయంలో విడిపోయిన నటి నటులు కూడా ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.

రష్మిక,రక్షిత్ శెట్టి:హీరోయిన్ రష్మిక మందాన కు కన్నడ స్టార్ హీరో అయినా రక్షిత్ శెట్టి తో నిశ్చితార్ధం జరిగింది.కానీ అనుకోని కారణాల వలన వీరిద్దరూ విడిపోయి పెళ్లి కాన్సల్ అయిపొయింది.

ఉదయ్ కిరణ్,సుష్మిత:చిత్రం సినిమాతో సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో బాగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.సుష్మితతో ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్ధం కూడా జరిగింది.అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడంతో పెళ్లి కాన్సల్ అయ్యింది.

అఖిల్,శ్రీయ భూపాల్:
అక్కినేని అఖిల్ శ్రీయ భూపాల్ ప్రేమించుకున్నారు.పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోవడంతో పెళ్లి కూడా ఆగిపోయింది.

మెహ్రిన్,భవ్య బిష్ణోయ్:
ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.అయితే ఆ తర్వాత అభిప్రాయం భేదాల కారణంగా వీరి పెళ్లి కాన్సల్ అయ్యింది.

తరుణ్,ఆర్తి అగర్వాల్:
ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు.కానీ వీరిద్దరి పెళ్లి జరగలేదు.

త్రిష,వరుణ్:
త్రిష,బిజినెస్ మ్యాన్ అయినా వరుణ్ మ్యానియాన్ ఇద్దరు ప్రేమించుకున్నారు.నిశ్చితార్ధం కూడా చేసుకొని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినా తర్వాత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.

శింబు,హన్సిక:ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వీరిద్దరూ మధ్యలోనే విడిపోవడం జరిగింది.

నయనతార,ప్రభుదేవా:ప్రభు దేవకు ఇదివరకే పెళ్లి అయ్యింది.ఆ తర్వాత ప్రభు దేవా,నయనతార ప్రేమించుకున్నారు.పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు కానీ మధ్యలోనే విడిపోయారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *