బండి మీద కూరగాయలు…అందరికి సోనూసూద్ ఇచ్చిన మెసేజ్ వీడియొ వైరల్….

కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసి వార్తల్లో నిలిచినా వ్యక్తి సోను సూద్.కార్మికులు,రోగులు ఇలా ఎంతో మంది సోను సూద్ సహాయాన్ని అందించారు.చాల మంది అభిమానులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన ఇంటికి కూడా వెళ్లడం జరిగింది.ఉద్యోగం కోసం కూడా చాల మంది ఆయన ఇంటి వద్దకు వెళ్లి అడగడం జరిగింది.అలాగే దేశవ్యాప్తంగా చాల మంది తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా సోను సూద్ కు తెలుపుతున్నారు.ఇటీవలే తాజాగా సోను సూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసారు.

ఆ వీడియొ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో సోను సూద్ తన ఇంటి దగ్గరకు వచ్చిన కూరగాయలు అమ్మే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు.వారిద్దరు ఎక్కడ నుంచి వచ్చారో కూడా సోనూసూద్ అడిగి తెలుసుకోవడం జరిగింది.ఇలా బండి మీద ఇంటి వద్దకు వచ్చే కూరగాయలు చాల తాజాగా ఉంటాయని సోనుసూద్ చెప్పుకొచ్చారు.

ఇలా ఇంటి దగ్గరకు బండి మీద కూరగాయలు అమ్మే వారి దగ్గర కూరగాయలు కొంటె చిన్న వ్యాపారులను సహాయం అందించినట్లు అవుతుందని సోనూసూద్ చెప్పుకొచ్చారు.తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్ చేయండి అంటూ క్యాప్షన్ తో సోనూసూద్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.ఎన్నికల్లో గెలిచినా వాళ్ళు తమ మానిఫెస్టోలో చెప్పింది చేయక పొతే రాజీనామా చెయ్యాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచినా సంగతి అందరికి తెలిసిందే.దింతో సోనూసూద్ రాజకీయాలలోకి వస్తారని సామజిక మాధ్యమాల్లో గట్టిగ చర్చ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *